Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీలో బ్రహ్మానందం!

Project K movie  update
  • తిరుగులేని హాస్యనటుగా బ్రహ్మానందం
  • విభిన్నమైన పాత్రలతో వినోదాల విన్యాసం
  • బ్రహ్మానందాన్ని ఒప్పించిన నాగ్ అశ్విన్
  • ఆయనకి ఇది తొలి పాన్ ఇండియా మూవీ    
తెలుగు తెరపై దశాబ్దాలుగా హాస్యాన్ని పరుగులు తీయిస్తున్న నటుడుగా బ్రహ్మానందం కనిస్తారు. బ్రహ్మానందం తెరపై కనిపిస్తే ఆ సందడి వేరు. ఆయన ఎక్స్ ప్రెషన్స్ ను .. డైలాగ్సును తల్చుకుని తల్చుకుని నవ్వని వాళ్లంటూ ఉండరు. ఆయన పోషించిన ఎన్నో విభిన్నమైన పాత్రలు .. గెటప్పులు .. మేనరిజమ్స్ ప్రేక్షకులకు కితకితలు పెడుతూనే ఉంటాయి.

అలాంటి బ్రహ్మానందం ఆరోగ్యం సహకరించని కారణంగా ఈ మధ్య సినిమాలు తగ్గించుకున్నారు. పాత్ర నచ్చితే తప్ప ఆయన ఒప్పుకోవడం లేదు. కొంత గ్యాప్ తరువాత ఇటీవల 'జాతిరత్నాలు' సినిమాలో ఆయన ప్రత్యేకమైన పాత్రలో కనిపించి నవ్వులు పూయించారు. అలాంటి బ్రహ్మానందం .. ప్రభాస్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రాజెక్ట్ K అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో హాస్యభరితమైన పాత్ర కోసం బ్రహ్మానందాన్ని తీసుకున్నారట. ఆ పాత్రకి ఆయన అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని నాగ్ అశ్విన్ భావించినట్టు చెబుతున్నారు. బ్రహ్మానందం తొలిసారిగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఇదేనని అంటున్నారు.
Prabhas
Nag Ashwin
Brahmanandam

More Telugu News